రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసిన హైకోర్టు

  • బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు న్యాయవాదులు
  • నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
  • ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పై స్టే కొనసాగింపు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. 7వ తేదీ వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉందని... సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తే ఈ కేసులో కూడా వర్తిస్తుందని చెప్పారు. విచారణను నవంబర్ కు వాయిదా వేయాలని కోరారు. మరోవైపు ఇదే కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పై హైకోర్టు ఇప్పటికే స్టే విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్టేను నవంబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. 


Chandrababu
Telugudesam
Bail
AP High Court

More Telugu News